తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వైరస్‌కు చికెన్‌కు సంబంధం లేదు: మంత్రి ఈటల - MINISTER EETALA SPAEKAS ABOUT CORONA VIRUS

కరోనా వైరస్‌కు చికెన్‌కు ఎటువంటి సంబంధం లేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చికెన్‌పై వస్తున్న పుకార్ల నేపథ్యంలో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్​లో ఎగ్​మేళాలో నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్​ యాదవ్, శ్రీనివాస్ గౌడ్​తో కలిసి ఈటల రాజేందర్ హాజరయ్యారు.

eetala speaks abou corona virus
కరోనా వైరస్‌కు చికెన్‌కు సంబంధం లేదు: మంత్రి ఈటల

By

Published : Feb 28, 2020, 6:57 PM IST

హైదరాబాద్​లోని పీపుల్స్ ప్లాజాలో నెక్, పౌల్ట్రీ సమాఖ్య ఆధ్వర్యంలో చికెన్, ఎగ్ మేళా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భారత్‌లో చికెన్‌ తిని ఎవరూ చనిపోలేదని మంత్రి ఈటల అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతుల వల్లే చికెన్, గుడ్ల వినియోగం తగ్గిందని తెలిపారు. బ్రాయిలర్ పెంపు వ్యయం రూ.77 ఉంటే రూ.35కు అమ్మాల్సి వస్తోందని పేర్కొన్నారు. గుడ్డు ఉత్పత్తి రూ.4 ఉంటే రూ.2.80 చొప్పున విక్రయించాల్సి వస్తోందని చెప్పారు. గత 2 నెలల్లో పౌల్ట్రీ పరిశ్రమకు రూ.500 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details