ప్రజల అవసరాలను ప్రైవేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా రోగుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు సహా.. చికిత్సకు రూ.4 లక్షలు డిపాజిట్ చేయమంటున్నారని.. బెడ్స్ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై విచారణ జరపాలి: మంత్రి ఈటల - మంత్రి ఈటల తాజా వార్తలు
కరోనా సమయంలో ప్రజల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై విజిలెన్స్ కమిటీని వేసి విచారణ జరపాలని మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. అలాంటి చర్యలకు పాల్పడుతోన్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై విజిలెన్స్ కమిటీని వేసి విచారణ జరపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజల భయాన్ని ప్రైవేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగి ప్రాణాలకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతోన్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రి.. ప్రజలు సైతం ప్రభుత్వ సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.
ఇదీచూడండి: బుధవారం రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!
TAGGED:
మంత్రి ఈటల తాజా వార్తలు