తెలంగాణ

telangana

ఆ ఆస్పత్రుల్లో మళ్లీ కొవిడ్ సేవలు: ఈటల

By

Published : Apr 3, 2021, 8:48 PM IST

కరోనా కేసుల పెరుగుదలపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో కొవిడ్ చికిత్స అందించిన అన్ని ఆస్పత్రుల్లో తిరిగి సేవలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే వైద్యం అందించాలని ప్రైవేట్​ ఆస్పత్రులను హెచ్చరించారు.

minister eetala review
అధికారులతో మంత్రి ఈటల సమీక్ష

గతంలో కరోనా వైద్యం అందించిన అన్ని ఆస్పత్రుల్లో మళ్లీ కొవిడ్​ సేవలు అందిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మళ్లీ ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్‌లు ఏర్పాటు చేశామని ఈటల పేర్కొన్నారు. 22 ఆస్పత్రుల్లో శాశ్వత లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంక్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కరోనా రోగుల తరలింపు కోసం నగరంలో 32 ప్రత్యేక 108 వాహనాలు అందుబాటులో ఉన్నాయన్న ఆయన.. హోం ఐసోలేషన్‌లోని బాధితులకు సూచనల కోసం మళ్లీ కాల్‌సెంటర్ పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్సకు నిర్దేశిత రేట్లు ఉన్నాయని.. ఆ రేట్లకే చికిత్స అందించాలని ప్రైవేట్ ఆస్పత్రులను హెచ్చరించారు.

ఇదీ చూడండి: 'అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు'

ABOUT THE AUTHOR

...view details