తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనాకు వైద్యం అందిస్తాం: ఈటల - CORONA VIRUS PREACAUTIONS

కరోనా రెండో దశలోకి ప్రవేశించామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వైరస్‌ను సమష్టిగా ఎదుర్కొందామని అన్నారు. కరోనాపై ముందు జాగ్రత్త చర్యలే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో 15,040 పడకలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

eetala rejender speaks about facilities of hospitals
కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం: ఈటల, మంత్రిో

By

Published : Mar 23, 2020, 12:53 PM IST

Updated : Mar 23, 2020, 4:34 PM IST

వైద్య కళాశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఎయిమ్స్, ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. ఎలాటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. హైదరాబాద్​లోని కోఠి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రి ఈటల సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశమయ్యారు.

పరికరాలను సమకూర్చుకునేందుకు విధివిధానాల ఖరారుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నర్సింగ్‌ విద్యార్థులు, పారా మెడికల్‌ విద్యార్థుల సేవలు ఉపయోగించుకుంటామని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు మనమంతా సమాయత్తం కావాలని మంత్రి ఈటల పిలుపునిచ్చారు.

కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం: ఈటల, మంత్రిో

ఇవీ చూడండి:లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. యథేచ్ఛగా మద్యం అమ్మకం

Last Updated : Mar 23, 2020, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details