వరుస వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై మంత్రి ఈటల.... వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు, కరోనా చికిత్సలపై సమావేశంలో చర్చించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలను మరింత పెంచాలన్న ఈటల... జీహెచ్ఎంసీ పరిధిలో ఈవెనింగ్ క్లినిక్లు మొదలు పెట్టాలని స్పష్టం చేశారు.
'సీజనల్ వ్యాధుల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోండి'
రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై మంత్రి ఈటల.... వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులను సీజనల్ వ్యాధుల చికిత్సకు సిద్ధం చేయాలన్నారు.
కలుషిత నీటి ద్వారా టైఫాయిడ్, కలరా, హెపటైటిస్, సాధారణ ఫ్లూ వచ్చే అవకాశం ఉందని.... ఆయా వ్యాధులపై ప్రజల్లో అవగాహన కలిగించాలని కోరారు. దోమల ద్వారా మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలు ఇబ్బంది పెట్టకుండా దోమల నియంత్రణ చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్న ఈటల... అవసరమైన సిబ్బందిని ఔట్ సోర్సిగ్ పద్ధతిలో విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులను సీజనల్ వ్యాధుల చికిత్సకు సిద్ధం చేయాలన్నారు. 13 రకాల స్పెషలిస్ట్ వైద్యులను అన్ని జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచనున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డీఎంఈ రమేశ్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, టీఎస్ ఎంఐడీసీ ఎండీ చంద్ర శేఖర్ రెడ్డి, కారోనా నిపుణుల కమిటీ సభ్యుడు డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ గంగాధర్ సహా పలువురు ఉన్నత అధికారులు హాజరయ్యారు.