రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై మంత్రి ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డీఎంఈ డా. రమేశ్ రెడ్డి, డీహెచ్ డా. శ్రీనివాస రావు, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కరోనా నిపుణుల కమిటీ సభ్యులు డా. కరుణాకర్ రెడ్డి, డా. గంగాధర్ పాల్గొన్నారు. కరోనా పరీక్షలు, నమోదవుతున్న కేసులు, రికవరీ రేటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్ష - eetala review on corona
minister-eetala-rajender-review-on-corona
15:35 August 20
వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్ష
Last Updated : Aug 20, 2020, 4:30 PM IST