కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధాని తనకు ఏ దేవుడు లేడు, వైద్యుడే దేవుడు అన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అలాంటి వైద్యులపై కొందరు మూర్ఖులు దాడి చేస్తున్నారని హైదరాబాద్లో చెప్పారు.
వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైద్యులు వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని గుర్తు చేశారు.