తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే.. సమాజ అభివృద్ధి: ఈటల

మహిళా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. చట్ట సభల్లో మహిళల ప్రాతినిథ్యం ఉంటేనే.. సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్​ బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

minister-eetala-rajender-participated-in-womens-day-celebretions
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే.. సమాజ అభివృద్ధి: ఈటల

By

Published : Mar 8, 2021, 10:20 PM IST

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజ అభివృద్ధి సాధ్యం అవుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. చట్ట సభల్లో మహిళల ప్రాతినిథ్యం ఉంటేనే.. సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో జాతీయ బీసీ సమాఖ్య ఛైర్​పర్సన్​ ఎం.భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

కరోనా కష్టకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్​వాడీ టీచర్లు, నర్సులు అందించిన సేవలు వెలకట్టలేనివని మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖలో 75 శాతం మహిళలు ఉండటం హర్షణీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఐకేపీ సెంటర్లు, పెన్షన్లు అందించడం లాంటి పనులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు మహిళలు చూసుకుంటున్న కుటుంబాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా దిశ, నిర్భయ లాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్న మంత్రి.. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం షీ-టీంలను ఏర్పాటు చేసిందన్నారు. మహిళా భద్రతకు పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: విమెన్స్​ డే స్పెషల్: ప్రతిరోజు ఆమెదే.. స్త్రీ విలువ తెలుసుకో.!

ABOUT THE AUTHOR

...view details