ఎల్బీ స్టేడియం వేదికగా జరుగుతున్న తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కళాశాలల వైద్యుల క్రికెట్ పోటీలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. కరోనా యోధులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు మంత్రి ఈటల. వ్యాక్సిన్ రాగానే 10 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రోజుకు 10 లక్షల మందికి టీకా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
తెలంగాణలో సెకండ్ వేవ్ లేదని.. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టిందని ... కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ సీసీఎంబీకి పంపించామని వెల్లడించారు.