తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్​ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి:ఈటల - హైదరాబాద్​ తాజా వార్తలు

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో అవసరమైన వసతులు కల్పించి, కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని... వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మందులు, పడకలు, సిబ్బంది కొరత లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై వైద్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Minister eetala Rajender held a review meeting with health department officials
కొవిడ్​ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి:ఈటల

By

Published : Apr 15, 2021, 2:48 AM IST

రెండో దశ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో వసతుల విషయంలో వైద్యశాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్ రాజారావు, ఆర్ఎంఓలతో ప్రత్యేకంగా సమావేశమైన మంత్రి... మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.

కొవిడ్​ కేసులు పెరుగుతున్నందున ఆస్పత్రిలో మందులు, పడకలు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. అవసరమైన వసతులు కల్పించి... కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పడకల సంఖ్యను పెంచి... ఆస్పత్రిలో ఇతర వైద్య సేవలను కూడా కొనసాగించాలన్నారు.

ఇదీ చదవండి: ఎస్సీ, ఎస్టీలను కేసీఆర్ మోసం చేశారు: వైఎస్ షర్మిల

ABOUT THE AUTHOR

...view details