కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఖర్చు గురించి వెనుకాడేది లేదు
గ్లోబలైజేషన్ వల్ల మహమ్మారి వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని మంత్రి వెల్లడించారు. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఖర్చు గురించి ప్రభుత్వం వెనకాడటం లేదని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ విషయంలో తెరాస ప్రభుత్వం రాజీపడబోదని ఈటల స్పష్టం చేశారు. భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ టీకా సమర్థతపై అనుమానాలు అవసరం లేదని.. ఈ టీకా పూర్తి స్థాయిలో కరోనా నుంచి రక్షణనిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కొవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రజారోగ్య సంచాలకుడి సమీక్ష