ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేల మందికి చికిత్స అందిస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆదివారం ఛాతి ఆసుపత్రిలో చనిపోయిన వ్యక్తి అనేక ఆసుపత్రులు తిరిగిన తర్వాత ప్రభుత్వాసుపత్రికి వచ్చినట్లు తెలిపారు. అర్ధరాత్రి పూట వచ్చినప్పటికీ అతన్ని అడ్మిట్ చేసుకుని ఆక్సిజన్ పెట్టామని చెప్పారు. ఆ వ్యక్తికి వెంటిలేటర్ కంటే కూడా ఆక్సిజన్ ముఖ్యం కాబట్టి అదే అందించామని స్పష్టం చేశారు. అతనికి వేరే ఆరోగ్య సమస్యలు చాలా ఉండటం వల్ల చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు ఈటల తెలిపారు.
ఎక్కడో ఒక్కరు చనిపోతే.. దుష్ప్రచారం చేస్తారా? మంత్రి ఈటల - minister eetala rajendar latest news
ఛాతి ఆసుపత్రిలో ఆదివారం వ్యక్తి చనిపోయిన ఘటనపై మంత్రి ఈటల స్పందించారు. అతను అనేక ఆసుపత్రులు తిరిగిన తర్వాత ప్రభుత్వాసుపత్రికి వచ్చినట్లు తెలిపారు. అతనికి వేరే ఆరోగ్య సమస్యలు చాలా ఉండటం వల్ల చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు ఈటల చెప్పారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం తగదని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేల మందికి చికిత్స అందిస్తున్నామన్న ఆయన... ఆరోగ్య శాఖలో 250 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. వైద్యులు ప్రాణాలు పణంగా పెట్టి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారనీ.. సామాజిక మాధ్యమాల్లో వైద్యులపై దుష్ప్రచారం తగదని సూచించారు. 184 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న మంత్రి... వారు కోలుకుని ప్రజలకు ధైర్యం ఇచ్చారని కితాబిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:హోంమంత్రికి కరోనా.. వైద్యాధికారులు ఏమంటున్నారంటే?