తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనాను వ్యాపారంగా చూడొద్దు.. అనవసరంగా పరీక్షలు చేయొద్దు' - మంత్రి ఈటల రాజేందర్ వార్తలు

కరోనా పరీక్షలను వ్యాపార కోణంలో చూడవద్దని మంత్రి ఈటల రాజేందర్ ప్రైవేట్​ డయాగ్నోస్టిక్స్ నిర్వాహకులకు సూచించారు. అనవసరంగా ఎవరికి పరీక్షలు నిర్వహించవద్దని... ఐసీఎంఆర్​ నిబంధనల మేరకు నడుచుకోవాలని ఆదేశించారు.

minister-etala-rajendar-review-meeting-with-private-diagnostics
'అనవసరంగా ఎవరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు చేయవద్దు'

By

Published : Jun 23, 2020, 3:12 PM IST

కరోనా పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని క్యాష్ చేసుకోవడం సరికాదని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. హైదరాబాద్​లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్​తో సమావేశమయ్యారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి హాజరయ్యారు.

''కరోనా పరీక్షలను వ్యాపార కోణంలో చూడకండి. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలు పోర్టల్​లో నమోదు చేయండి. అనవసరంగా ఎవరికీ పరీక్షలు నిర్వహించవద్దు. ఐసీఎంఆర్ నిబంధనల మేరకు నడుచుకోండి. కొవిడ్​ పరీక్షకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఫలితాలు వచ్చే వరకు ఐసోలేషన్​లో ఉండేలా సూచించండి. తమ సిబ్బందికి వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి.''

-మంత్రి ఈటల రాజేందర్

'అనవసరంగా ఎవరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు చేయవద్దు'

కరోనా పరీక్షలపై అనవసర ప్రచారాలు చేయవద్దన్న ఈటల... విమానాల్లో వచ్చిన వారికి లక్షణాలు లేకపోయినా వైరస్‌ నిర్ధరణ పరీక్షలు చేయవచ్చన్నారు.

ఇవీ చూడండి:'వివాహానికి దేశం కాదు.. ప్రేమ ముఖ్యం'

ABOUT THE AUTHOR

...view details