ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షల ధరను రూ. 2 వేల 200లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెంటిలేటర్ లేకుండా చికిత్స అందిస్తే రోజుకు రూ. 7వేలు, అలాగే వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తే రూ. 9వేలు చెల్లించాలని నిర్దేశించింది. ఈ మేరకు వైద్యశాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మంత్రి ఈటల రాజేందర్ వివరాలు వెల్లడించారు.
కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు
ఐసీఎంఆర్ నిబంధనలకు లోబడే రాష్ట్రంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని ఈటల స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు చేయాలని అధికారులకు అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి ప్రకటించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే లాక్‌డౌన్‌ను విధించామని, ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చిన అనంతరం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: మంత్రి ఈటల ఇవీ చూడండి: లాక్‌డౌన్ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: మంత్రి ఈటల