రాజకీయ పార్టీల నాయకులు రాజకీయాల్లో హుందాగా ప్రవర్తించాలని, ఓట్ల కోసం ప్రజలను మభ్య పెట్టేలా మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ హితవు పలికారు. గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్ నగర్లో తెరాస అభ్యర్థి తరఫున గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్న నగరం అని కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే నగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన అన్నారు.
రాజకీయ నాయకులు హుందాగా ప్రవర్తించాలి: ఈటల
రాజకీయ నాయకులు హుందాగా ప్రవర్తించాలని, ఓట్ల కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని మంత్రి ఈటల రాజేందర్ హితవు పలికారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్ నియోజక వర్గంలోని రహ్మత్ నగర్ డివిజన్లో పర్యటించారు. అభ్యర్థి నారాయణరెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
రాజకీయ నాయకులు హుందాగా ప్రవర్తించాలి: ఈటల
గ్రేటర్ ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఇలాంటి వాటిని మానుకోవాలని ఈటల సూచించారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు తప్పక విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం రహమత్ నగర్ అభ్యర్థి నారాయణరెడ్డిని ప్రజలు గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.