వైద్యులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆరోగ్య తెలంగాణకు అందరి సహకారం కావాలని... సర్కారు దవాఖానాపై ప్రజల్లో భరోసా కల్పించాలని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు తోడుగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది నిర్విరామంగా పనిచేయడం వల్లే వైద్యరంగంలో తెలంగాణ ముందుకెళుతోందని మంత్రి అన్నారు. తెరాస ప్రభుత్వం వచ్చిన తరువాత ఐదేళ్లలో నాలుగు వైద్య కళాశాలలు వచ్చాయని ఎయిమ్స్, ఈఎస్ఐ కాలేజీలు కలిపితే మొత్తం ఆరు కళాశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇవన్నీ పూర్తిస్థాయిలో సేవలందిస్తే ఉస్మానియా మీద భారం తగ్గుతుందని చెప్పారు. ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా పనిచేస్తున్న 9 ఆస్పత్రుల్లో ఉన్న సమస్యలను విభాగాల వారీగా సమస్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగుల రద్దీకి అనుగుణంగా వైద్యులు, నర్సుల సంఖ్య పెంచుతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు.
అందరి సహకారంతోనే ఆరోగ్య తెలంగాణ సాధ్యం: మంత్రి ఈటల - Miniater_Etela_Meet_Doctors
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న వైద్యులతో ముఖాముఖి అంటూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి ఈటల రాజేందర్. పూర్తి స్థాయిలో పనిచేసి ప్రజలకు సేవలందిస్తామని వైద్యులంతా మంత్రికి భరోసా ఇచ్చారు.
వైద్యులతో మంత్రి ఈటల ముఖాముఖి