రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. గత ఆదివారం నాడు పరీక్షలు చేయించుకోగా మల్లారెడ్డికి, ఆయన భార్యకు కరోనా పాజిటివ్‌గా తేలింది. మల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందారు.
పాజిటివ్ వచ్చింది కానీ..ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పిన మంత్రి - ఆదివారం నాడు పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్
గత ఆదివారంనాడు కొవిడ్ టేస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్ ఉండి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నానని చెప్పారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు. కరోనా రాగానే భయానికి గురి కాకుండా మనోధైర్యాన్ని పెంచుకోవాలన్నారు.
![పాజిటివ్ వచ్చింది కానీ..ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పిన మంత్రి minister-corona-positive-corona-positive-the-minister-who-said-that-he-is-healthy-now](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8345565-1019-8345565-1596894290040.jpg)
పాజిటివ్ వచ్చింది కానీ..ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పిన మంత్రి
పాజిటివ్ వచ్చింది కానీ..ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పిన మంత్రి
ప్రస్తుతం మల్లారెడ్డి వైద్య కళాశాలలో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని.. ఎలాంటి లక్షణాలు లేవని ఆయన పేర్కొన్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ.. ధైర్యంగా ఉంటే కరోనాను జయించవచ్చునని పేర్కొంటూ మంత్రి మల్లారెడ్డి వీడియోను విడుదల చేశారు.
ఇదీ చూడండి :'ప్రతిపక్ష నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు'
Last Updated : Aug 8, 2020, 11:04 PM IST