Ministers Committee Meet: ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగుల డిమాండ్లపై మంత్రుల కమిటీ సమావేశం కొనసాగుతోంది. నిన్న అర్ధరాత్రి వరకు ఉద్యోగులతో చర్చించిన మంత్రుల కమిటీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మరోసారి సమావేశమైంది. మంత్రులు బొత్స, బుగ్గన, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్, ఆర్ధిక శాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
ఉద్యోగ సంఘాలతో ఈ మధ్యాహ్నం మరోసారి చర్చలు ఉండటంతో వారి డిమాండ్లపై మంత్రుల కమిటీ మంతనాలు జరుపుతోంది. ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి, ఆవేదనకు పరిష్కారం చూపామని మంత్రి బొత్స తెలిపారు. ఇప్పుడు మళ్లీ సమావేశమవుతున్నామని, అన్ని అంశాలు సీఎంకి వివరిస్తామని మంత్రి పేర్కొన్నారు. మధ్యాహ్నం మళ్లీ ఉద్యోగులతో చర్చిస్తామని తెలిపారు. హెచ్ఆర్ఏ గురించి ఈ రోజు చర్చిస్తామన్న మంత్రి.., రికవరీ విషయంలో స్పష్టత ఇచ్చామని వివరించారు. ఇక మిగిలిన సమస్యలు అన్నీ చిన్న చిన్న విషయాలేనని మంత్రి వెల్లడించారు.