తెలంగాణ

telangana

ETV Bharat / state

'48 గంటల సవాలు విసిరి ఏం చేశారో చెప్పాలి' - అమరావతిపై బొత్స సత్యనారాయణ కామెంట్స్

48 గంటల సవాలు విసిరి ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని ఏపీ మంత్రి బొత్స నిలదీశారు. వెనుక, ముందు కట్ చేసి చంద్రబాబు వీడియోలు వదులుతున్నారని బొత్స ఆరోపించారు. ఏపీ సీఎం జగన్‌ మాటలను తనకు అనుకూలంగా మార్చి వినిపిస్తున్నారని చెప్పారు. చంద్రబాబుకు ఎందులో పేటెంట్‌ ఉందో అందరికీ తెలుసన్న మంత్రి బొత్స... రాజ్యాంగం, చట్టాలకు లోబడే నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

minister-botsa-satyanarayana-fires-on-chandrababu-over-amaravati
'48 గంటల సవాలు విసిరి ఏం చేశారో చెప్పాలి'

By

Published : Aug 6, 2020, 4:31 PM IST

'48 గంటల సవాలు విసిరి ఏం చేశారో చెప్పాలి'

ఆంధ్రప్రదేశ్​లోని అమరావతిని అభివృద్ధి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పామన్న బొత్స... ఏపీ అంటే అమరావతిలోని ఆ 29 గ్రామలేనా..? అని ప్రశ్నించారు. తమ నినాదం వికేంద్రీకరణ, 13 జిల్లాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వ్యక్తిగత స్వార్థం, దోపిడీ కోసమే వారు నిర్ణయాలు తీసుకున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలు పదవులు వదిలి ప్రజల వద్దకు వెళ్లాలని హితవు పలికారు.

అమరావతిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని ఏపీ మంత్రి బొత్స పేర్కొన్నారు. విశాఖకు సమాంతరంగా అమరావతి, కర్నూలు అభివృద్ధి జరుగుతుందని వివరించారు. విశాఖలో త్వరలో సీఎం జగన్‌ శంకుస్థాపన చేస్తారన్న మంత్రి బొత్స... అనకాపల్లి నుంచి విజయనగరం వరకు అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. విశాఖలో శంకుస్థాపన చేస్తామన్న వెంటనే కోర్టులో కేసులు వేశారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని కాదని ఎవరు చెప్పారని ప్రశ్నించారు.

ఇదీ చూడండి :ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం

ABOUT THE AUTHOR

...view details