తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్థిక శాఖపై మంత్రి భట్టి విక్రమార్క సమీక్ష - 'అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే లక్ష్యాలు సాధిస్తాం' - Minister Bhatti Review on Finance Department

Minister Bhatti Vikramarka Review on Finance Department : ఆర్థికశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క తొలిసారిగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఆదాయ, వ్యయాలు, తదితర వివరాలను ఉపముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. శాసనసభ వాయిదా పడిన అనంతరం సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎంకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అధికారులు స్వాగతం పలికారు.

Minister Bhatti Vikramarka Finance Review
Minister Bhatti Vikramarka Review on Finance Department :

By ETV Bharat Telangana Team

Published : Dec 9, 2023, 9:48 PM IST

Minister Bhatti Vikramarka Review on Finance Department :రాష్ట్రంలో మంత్రులకు శాఖల కేటాయింపులో భాగంగా భట్టి విక్రమార్కకు ఆర్థికశాఖ(Finance Minister) కేటాయించారు. ఈ క్రమంలో తొలిసారిగా ఆర్థికశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఆదాయ, వ్యయాలు, తదితర వివరాలను ఉపముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న రేవంత్​రెడ్డి - మహాలక్ష్మి పథకం ప్రారంభం

శాసనసభ వాయిదా పడిన అనంతరం సచివాలయానికి వచ్చిన ఆయనకు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆర్థికశాఖ కార్యదర్శులు, అధికారులతో భట్టివిక్రమార్క సమీక్ష నిర్వహించారు. 2014 జూన్ రెండో తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆదాయం, వ్యయం, కలిగిన ప్రయోజనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గ(Cabinet) సమావేశంలో తీర్మానించారు. అందుకు సంబంధించిన అంశాలపై కూడా భట్టి విక్రమార్క అధికారులతో చర్చించారు.

Bhatti Vikramarka Review on State Financial Status : రాష్ట్రం ఐదున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని, అయినప్పటికీ సవాల్​గా ఆర్థికశాఖ బాధ్యతలు తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు(Congress Six guarantees), అభయ హస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చేలా ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అధికారులు మనస్ఫూర్తిగా పనిచేయాలని వారిని కోరారు. ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో ఆర్థిక మంత్రి భట్టి సచివాలయంలో సమావేశమయ్యారు.

తెలంగాణ కొత్త కేబినెట్ మంత్రులు - ఎవరెవరికి ఏయే శాఖ కేటాయించారంటే?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయం, వ్యయం, అప్పుల గురించి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వివరించారు. సంపద సృష్టించడం, సృష్టించిన సంపద ప్రజలకు పంచడం కోసం అధికారులు కృషి చేయాలని, ఆదాయ వనరుల(Sources of Income) అన్వేషణ కోసం మేదస్సును ఉపయోగించాలని భట్టి విక్రమార్క కోరారు. ప్రభుత్వ విజయం ఆర్థికశాఖపై ఆధారపడి ఉంటుందన్న ఆయన, ఉద్యోగస్తుల్లా కాకుండా రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నామన్న చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా విధులు నిర్వర్తిస్తే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని సూచించారు.

ఇకపై ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితమే- మహిళలంతా మస్త్​ ఖుష్

అలా చేస్తే ప్రభుత్వ విజయానికి దోహదపడిన వారు అవుతారని మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని కలిసికట్టుగా సాధిద్ధామని ఉపముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పాదయాత్ర సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పుకున్న బాధలు విన్న తర్వాత తెచ్చుకున్న తెలంగాణకు అర్థం లేదని భావించి, వారి సమస్యల పరిష్కారం కోసం ఆరు గ్యారెంటీలు, అభయహస్తం మేనిఫెస్టోలో హామీలను ప్రకటించినట్లు తెలిపారు.

Telangana Financial Goals :ఇళ్లు లేక కొందరు, కొలువులు లేక నిరుద్యోగులు, ఉన్నత చదువులు చదివించలేక విద్యార్థుల తల్లిదండ్రులు, ఉన్నత చదువులు చదివిన కొలువులు(Jobs) రాకపోవడంతో యువత దుస్థితిని పాదయాత్రలో చూసినట్లు భట్టి వివరించారు. ఉచితాలను ప్రజలకు ప్రభుత్వాలు ఫ్రీగా ఇవ్వడం లేదని, మానవ వనరులపై పెట్టుబడి చేస్తున్నట్లు భావించాలని వ్యాఖ్యానించారు.

మానవ వనరులను బలోపేతం చేసుకోవడం వల్ల జీడీపీ పెరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. మిగిలిన గ్యారెంటీలు, కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టోలో(Congress Manifesto) పొందుపరిచిన హామీలు నెరవేర్చడానికి ఆదాయ వనరులను సమకూర్చుకునే దిశగా అధికార యంత్రాంగం పనిచేయాలని భట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై మహిళల ఆనందం

రెండో రోజు అదే ఉత్సాహం - ప్రజాదర్బార్​కు విశేష స్పందన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details