తెలంగాణ

telangana

ETV Bharat / state

గనుల్లో మెరిసిన సంధ్య.. భారత మైనింగ్​ రంగ మొదటి​ మహిళగా గుర్తింపు - మైనింగ్​ మహిళ సంధ్య తాజా వార్త

మైనింగ్ రంగంలో మహిళలకు అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మైనింగ్ రంగంలో, అండర్ గ్రౌండ్ సెకండ్ క్లాస్ మేనేజర్​గా సర్టిఫికెట్ పొందిన తొలి మహిళగా పేరొందిన రాసకట్ల సంధ్యను ఆమె అభినందించారు.

mining lady sandhya meet mlc kavitha in hyderabad
గనుల్లో మెరిసిన సంధ్య.. భారతదేశ మైనింగ్​ రంగ మొదటి​ మహిళగా గుర్తింపు

By

Published : Nov 5, 2020, 7:10 PM IST

భారతదేశ మైనింగ్ రంగంలో, అండర్ గ్రౌండ్ సెకండ్ క్లాస్ మేనేజర్​గా సర్టిఫికెట్ పొందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన రాసకట్ల సంధ్యను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. మైనింగ్ రంగంలో మహిళలకు అవకాశాలు కల్పించాలన్నారు. హైదరాబాద్​లోని నివాసంలో ఎమ్మెల్సీ కవితను సంధ్య కలిశారు. మైనింగ్ రంగంలో సంధ్య సాధించిన విజయం, ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర మహిళలు సాధిస్తున్న గొప్ప విజయాలతో, హృదయం గర్వంతో నిండిపోతోందని కవిత హర్షం వ్యక్తం చేశారు.

భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రాసకట్ల సంధ్య, బీటెక్‌ మైనింగ్‌ చదివిన రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ (వేదాంత) కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తండ్రి రఘు ఓ సింగరేణి కార్మికుడిగా పనిచేస్తున్నారు.

ఇదీ చూడండి:అనాథలకు సాయం చేసి మానవత్వం చాటుకున్న మంత్రి మల్లారెడ్డి

ABOUT THE AUTHOR

...view details