తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపాకు, ఎంఐఎంకు ఎలాంటి పోటీ లేదు: అసదుద్దీన్‌ ఒవైసీ

జీహెచ్​ఎంసీ మేయర్ ఎన్నికపై తమనెవరూ సంప్రదించలేదని ఎంఐఎం జాతీయాధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. ఓటమిపై తెరాస పునరాలోచించుకోవాలని సూచించారు. గ్రేటర్​లోలా ప్రధాన ఎన్నికల్లో భాజపా ప్రభావం చూపలేదని పేర్కొన్నారు.

asaduddin
asaduddin

By

Published : Dec 5, 2020, 5:56 PM IST

Updated : Dec 5, 2020, 7:02 PM IST

ఎన్నిక ఏదైనా, పార్టీ ఏదైనా ప్రజల తీర్పు గౌరవించాల్సిందేనని ఎంఐఎం జాతీయాధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. మేయర్ ఎన్నికపై తమనెవరూ సంప్రదించలేదని, ఒకవేళ ఎవరైనా వస్తే.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

తాత్కాలికమే..

గ్రేటర్​ ఎన్నికల్లో భాజపా విజయం తాత్కాలికమేనన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేసిన వార్డులో కూడా భాజపా గెలవలేదని గుర్తు చేశారు. సర్జికల్ స్ట్రైక్ అని, రోహింగ్యాలు అని.. తప్పుడు ప్రచారాలు చేసి భాజపా లబ్ధిపొందిందని ఆరోపించారు.

తెరాస పునరాలోచించాలి...

తెరాసకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని అసదుద్దీన్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కోల్పోయిన వార్డులపై తెరాస ఆలోచించుకోవాలని సూచించారు. భాజపాకు, ఎంఐఎంకు ఎలాంటి పోటీ లేదని తెలిపారు.

భాజపాకు, ఎంఐఎంకు ఎలాంటి పోటీ లేదు: అసదుద్దీన్‌ ఒవైసీ

ఇదీ చదవండి :హైదరాబాద్​ను భాగ్యనగరంగా మార్చాల్సిందే: బండి సంజయ్

Last Updated : Dec 5, 2020, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details