రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
కరోనా కేసులు పెరుగుతున్నాయ్.. టీకా తప్పనిసరి: అసదుద్దీన్ - MP Asaduddin Owaisi news
ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కొవిడ్ టీకా వేయించుకున్నారు. రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని.. వ్యాక్సిన్ తప్పనిసరి వేయించుకోవాలని సూచించారు.
అసదుద్దీన్ ఓవైసీ
కంచన్ బాగ్లోని ఓవైసీ ఆస్పత్రిలో ఆయన కొవిడ్ టీకా వేయించుకున్నారు. ప్రతి ఒక్కరూ టీకా త్వరగా తీసుకోవాలని.. కరోనా నుంచి రక్షణ పొందాలని విజ్ఞప్తి చేశారు.