"పాతబస్తీలో పైవంతెనలు, కాలిబాటలు, బస్ బేలు లేవు. పాతబస్తీలో అనేక విద్యాసంస్థలున్నా మౌలిక సౌకర్యాలు లేవు. అక్కడ చదివే విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముషీరాబాద్, బోరబండ, హఫీజ్‌పేట, ఎర్రగడ్డలో ఎస్‌టీపీ ప్లాంటులు లేవు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వైద్యసేవలు మెరుగుపరచాలి. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి. మరిన్ని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో యాచకుల సమస్య పరిష్కరించాలి. ఇందిరాపార్కు వద్ద ఎటుచూసినా యాచకులే కనిపిస్తున్నారు.
పాతబస్తీలో అనేక పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి. పాతబస్తీలో రహదారుల వెడల్పు పనులు చేపట్టాలి. ఆక్రమణలు ఎప్పుడు తొలగిస్తారో చెప్పాలి. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు కోసం ఎంఐఎం ఎంతో పోరాడింది. ఇన్ని వర్షాలు కురిసినా గండిపేట, హిమాయత్‌సాగర్‌లో నీళ్లు లేవు. గండిపేట, హిమాయత్‌సాగర్‌కు నీళ్లు వచ్చే కాల్వలు మూసేశారు. మూసీ నది పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. వెంటనే మూసీ నది సుందరీకరణ పనులు చేపట్టాలి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆటస్థలాలన్నీ మూలన పడ్డాయి. జీహెచ్‌ఎంసీలో ఆటస్థలాల అభివృద్ధిపై దృష్టి సారించడం లేదు.