తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో వాళ్లుంటే మీరు నిద్రపోతున్నారా?: అసద్ - భాజపాపై అసదుద్దీన్ వ్యాఖ్యలు

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ భోలక్​పూర్​లో ప్రచారం నిర్వహించారు. భాజపాపై విమర్శలు గుప్పించిన ఆయన... హైదరాబాద్​లో పాకిస్థాన్‌ వాసులు, రోహింగ్యాలు ఉంటే నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు.

హైదరాబాద్​లో వాళ్లుంటే మీరు నిద్రపోతున్నారా?: అసద్
హైదరాబాద్​లో వాళ్లుంటే మీరు నిద్రపోతున్నారా?: అసద్

By

Published : Nov 25, 2020, 8:07 PM IST

Updated : Nov 25, 2020, 10:47 PM IST

హైదరాబాద్​లో వాళ్లుంటే మీరు నిద్రపోతున్నారా?: అసద్

హైదరాబాద్‌లో పాకిస్థాన్‌ వాసులు, రోహింగ్యాలు ఉంటే ఆ విషయాన్ని పట్టించుకోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్‌ చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ డిమాండ్ చేశారు. ఆరున్నరేళ్లుగా మీ ప్రభుత్వమే ఉందని.... పాకిస్థాన్‌ వాసులు, రోహింగ్యాలు ఉంటే నిద్రపోతున్నారా అని మోదీ, అమిత్ షాను అడుగుతున్నట్లు తెలిపారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికల సందర్భంగా భోలక్‌పూర్‌లో అసదుద్దీన్ ఓవైసీ ప్రచారంలో నిర్వహించారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసినప్పుడు ఒక్క కేంద్రమంత్రి రాలేదని... ఇప్పుడు ఎన్నికల కోసం ఎందుకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో గొడవలు పెట్టాలని భాజపా చూస్తోందని ఓవైసీ ఆరోపించారు.

భాజపా మోదీ... ఫొటోతో కాకుండా ఓవైసీ ఫొటోతో ఓట్లు అడుగుతోంది. లాల్​దర్వాజ ఆలయం కోసం నిధులు ఇవ్వాలని అక్బరుద్దీన్​ ఓవైసీ అసెంబ్లీ వేదికగా అడిగిన విషయాన్ని భాజపా మరిచిపోయింది. భాజపా, తెరాస, కాంగ్రెస్‌ మూడు పార్టీలు అసద్‌ను విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్‌ ఆరిపోతున్న దీపం. ఆ పార్టీలో ఉన్నవాళ్లు సైతం మజ్లిస్‌కే ఓటు వేస్తామని చెబుతున్నారు.

--- ప్రచారంలో అసదుద్దీన్​ ఓవైసీ

ఇదీ చూడండి:దమ్ముంటే సమాధులు కూల్చండి: అక్బరుద్దీన్

Last Updated : Nov 25, 2020, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details