తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్​ - తెలంగాణ తాజా వార్తలు

హైదరాబాద్​ కార్వాన్​ పరిధిలోని రూ.8 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ అసదుద్దీన్​, ఎమ్మెల్యే కౌసర్​ మోహినుద్దీన్ ప్రారంభించారు. గత అక్టోబర్‌లో భారీ వర్షాల కారణంగా కూలిపోయిన హకీంపేటలోని బాల్కాపూర్‌ నాలా ప్రహరి గోడను కోటిన్నర రూపాయల వ్యయంతో పునర్నిర్మించారు.

mp asaduddin
కార్యాన్​లో పర్యటించిన ఎంపీ అసదుద్దీన్​

By

Published : Apr 6, 2021, 5:10 PM IST

ఎంఐఎం అధినేత, హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ.. కార్వాన్​ నియోజకవర్గంలో పర్యటించారు. నానల్‌నగర్‌ డివిజన్‌లో రూ.8 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కౌసర్‌ మోహినుద్దీన్, ఇతర నేతలతో కలిసి ప్రారంభించారు.

రుమాన్​ హోటల్‌ నుంచి నిజాం కాలనీలోని మసీదు వరకు రూ.3 కోట్లతో చేపట్టిన పనులు.. అక్కడి నుంచి అల్​ హస్నాత్‌ కాలనీలోని క్రికెటర్ సిరాజ్‌ నివాసం వరకు రూ.కోటి 25 లక్షల వ్యయంతో చేపట్టిన పనులను ప్రారంభించారు.

గత అక్టోబర్‌లో భారీ వర్షాల కారణంగా కూలిపోయిన హకీంపేటలోని బాల్కాపూర్‌ నాలా ప్రహరి గోడను కోటిన్నర రూపాయల వ్యయంతో పునర్నిర్మించారు. దీనితోపాటు హకీంపేటలో కోటి ఆరు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన డ్రైయిన్‌ పనులను ప్రారంభించారు.

ఇవీచూడండి:రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు

ABOUT THE AUTHOR

...view details