రాష్ట్రంలో సామలు, కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జలు... ఈ తృణధాన్యాల పంటల సాగు గణనీయంగా పెరుగుతోంది. విప్లవాత్మక వాతావరణ మార్పులు, మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు, అభిరుచులతో చిరుధాన్యాలకు ఎనలేని డిమాండ్ ఉంటోంది. పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, అంకుర కేంద్రాల నిర్వాహకులు గ్రామాల్లో నేరుగా రైతులను సంప్రదిస్తున్నారు. తిరిగి కొనుగోలు - బై బ్యాక్ ఒప్పందాలు చేసుకుంటూ సాగుకు అన్ని రకాలుగా సాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఇప్పటికే రాయితీపై 310 క్వింటాళ్ల విత్తనాలను వ్యవసాయ శాఖ తరఫున విక్రయించింది.
తృణధాన్యాల పైరు సాధారణ విస్తీర్ణం గతేడాది వరకు గరిష్ఠంగా 526 ఎకరాలే ఉండేది. ప్రస్తుత కాలంలో సాగు ఎక్కువగా పెరగడం వల్ల ఎంత విస్తీర్ణంలో వేశారన్నది గ్రామాల వారీగా లెక్కలు తీస్తున్నారు. ఈసారి 50వేల ఎకరాలకు ఉంటుందని అంచనా.
90శాతం రాయితీ