పాల ఉత్పత్తి అధికంగా ఉండాల్సిన శీతాకాలంలోనూ తెలంగాణ ఇతర రాష్ట్రాలపై (milk shortage) ఆధారపడుతోంది. రోజూ బయట నుంచి 20 లక్షల లీటర్లు కొంటే తప్ప చాయ్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. పలు ప్రైవేటు డెయిరీలతో పాటు, ప్రభుత్వానికి చెందిన విజయ డెయిరీ (Vijaya dairy) సైతం నిత్యం లక్ష లీటర్ల వరకూ కర్ణాటక సహకార డెయిరీల సమాఖ్య నుంచి కొంటోంది. రాష్ట్రంలో నిత్యం 1.40 కోట్ల లీటర్ల పాలు అవసరమని పశుసంవర్ధక శాఖ అంచనా. కానీ మొత్తం ఉత్పత్తి (milk shortage) 1.20 కోట్ల లీటర్లలోపే ఉంది. విజయ డెయిరీ (Vijaya dairy) నిత్యం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు 3.50 లక్షల లీటర్లను విక్రయిస్తోంది. రాష్ట్రంలో రైతుల నుంచి 2.50 లక్షల లీటర్లే డెయిరీకి వస్తున్నాయి. మిగతా లక్ష లీటర్లను బయట కొని (milk shortage) ప్రజలకు విక్రయిస్తోంది.
ఎందుకింత కొరత...?
- పాడి పశువుల పెంపకం ఖరీదైన వృత్తిగా మారుతోంది. కూలీలు దొరకడం లేదు. చిన్న డెయిరీల్లో పశువుల దగ్గర పనిచేయడానికి బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి కూలీలను పిలిపించి నియమించినట్లు రాష్ట్ర పాడి రైతుల సంఘం నేత బాల్‌రెడ్డి చెప్పారు.
- సాగునీటి లభ్యతతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో పశువులను మేపడానికి ఖాళీ భూములు తగ్గిపోయాయి.
- రోజూ కూలికి వెళితే రూ.300 నుంచి 500 దాకా ఇస్తున్నారు. పాడి వల్ల అంత ఆదాయం రావడం లేదని ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు.
- దాణాలో కలిపే సోయా, మొక్కజొన్న చెక్క ధరలు ఇటీవల ఏకంగా 20 శాతం పెరిగాయి. 25 కిలోల నాణ్యమైన దాణా చెక్క కావాలంటే రూ.వెయ్యి ఖర్చవుతోంది. దీంతో చాలామంది పాడిపై దృష్టి పెట్టడం లేదు.
- పశుగ్రాసం పెంపకం పెద్దగా లేదు. రైతులు పంటల సాగుపైనే ఆసక్తి చూపుతున్నారు.