ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ, కార్మిక పక్షపాతి అని తెరాస కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అన్నారు. వేతనాలు పెంచినందుకు బాగ్లింగపల్లిలోని టీఆర్ఎస్కేవీ కార్యాలయం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
'కేసీఆర్ పాలన కార్మిక వర్గానికి స్వర్ణయుగం' - హైదరాబాద్ తాజా వార్తలు
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కార్మిక, ఉద్యోగ వర్గాలకు స్వర్ణయుగం లాంటిదని తెరాస కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అన్నారు. వేతనాలు పెంచడంతో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. ఉద్యోగ, కార్మిక వర్గం ఆయనకు రుణపడి ఉంటుందని తెలిపారు.
ఇదీ చూడండి: వీఎస్టీ కార్మిక సంఘం ఎన్నికల బరిలో నాయిని అల్లుడు