తెలంగాణ

telangana

జర జాగ్రత్త: ఆ జిల్లాల్లో రాగల మూడురోజులు భారీ వర్షాలు

By

Published : Jul 12, 2020, 5:59 PM IST

వచ్చే 3 రోజులూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు స్పష్టం చేసింది.

'రానున్న 3 రోజులూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు'
'రానున్న 3 రోజులూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు'

రాగల మూడు రోజులపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం ఉరుములు మెరుపులతో అనేక చోట్ల వర్షాలు పడతాయని సంచాలకురాలు రత్నప్రభ పేర్కొన్నారు.

మోస్తరు నుంచి భారీ వర్షాలు...

వచ్చే రెండు రోజులు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ జిల్లాలో భారీ వర్షపాతం నమోదుకానుందని తెలిపారు. తూర్పు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాల్లోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒడిస్సా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని వివరించారు.

'రానున్న 3 రోజులూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు'

ఇవీ చూడండి : ఎస్‌ఆర్ఎస్​పీ వరదకాల్వ ఎగువన నీటి ఇబ్బందులపై సీఎం సమీక్ష

ABOUT THE AUTHOR

...view details