కరోనా మహమ్మారి విలయం వలస కూలీలపై విరుచుకుపడుతోంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. వారి స్వస్థలాలకు వెళ్లడానికి నానా తంటాలు పడుతున్నారు. కొందరు నడుస్తూ... మరికొందరు వాహనాలను ఆశ్రయిస్తూ... మరికొందరు సైకిళ్లపై వందల కిలోమీటర్లు పయనమై వెళ్తున్నారు.
స్వస్థలమే గమ్యం.. సైకిళ్లపై 1200 కిలోమీటర్ల ప్రయాణం - migrants difficulty at vijyanagaram
కన్న ఊరిని వదలి.. పని కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లారు. లాక్ డౌన్ తో అన్ని పనులు ఆగిపోయాయి. ఏ పని చేయాలి? కడుపు ఎలా నింపుకోవాలన్నదే వారి బాధ. సొంతూరు వెళ్తే ఎలా అయినా బతకొచ్చనేదే వారి నమ్మకం. సైకిల్ నే నమ్ముకున్నారు. 1200 కిలోమీటర్లు ప్రయాణం దాని మీదే మొదలుపెట్టారు.
స్వస్థలమే గమ్యం.. సైకిళ్లపై 1200 కిలోమీటర్ల ప్రయాణం
ఈ క్రమంలో విజయవాడలో ఒక పరిశ్రమ మూత పడిన కారణంగా... అక్కడకు వెళ్లిన వలస కూలీలు సైకిళ్లపై వారి స్వస్థలమైన కోల్‌కత్తా ప్రయాణయ్యారు. సుమారు 52మంది భోగాపురం జాతీయ రహదారి గుండా వెళ్తూ కనిపించారు. బతికేందుకు వేరే మార్గం లేక.. స్వస్థలాలకు చేరడమే మంచిదనుకోని బయల్దేరామన్నారు.
ఇదీ చూడండి :రోజూ 'గ్రీన్ టీ' తాగితే బరువు తగ్గుతారా?