తెలంగాణ

telangana

ETV Bharat / state

మేం ఇక్కడే చిక్కుకుపోయాం.. స్వస్థలాలకు చేర్చండి - ఉన్నతాధికారుల ఆదేశాలు

స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు వలస కూలీలకు, విద్యార్థులకు కేంద్రం పాసులు మంజూరు చేయాలని రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో ఎస్​ఆర్​నగర్ ఠాణాకు పెద్ద ఎత్తున యువతీ యువకులు చేరుకున్నారు. చేతిలో దరఖాస్తులు పట్టుకుని స్వస్థలాలకు వెళ్లేందుకు పాసులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

మమ్మల్ని మా స్వరాష్ట్రాలకు పంపించండి : బాధితులు
మమ్మల్ని మా స్వరాష్ట్రాలకు పంపించండి : బాధితులు

By

Published : May 3, 2020, 11:21 PM IST

లాక్​డౌన్ కొనసాగుతోన్న నేపథ్యంలో హైదరాబాద్​లో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల వారు స్వస్థలాలకు వెళ్లేందుకు తమకు పాసులు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఎస్​ఆర్​నగర్ ఠాణాకు విద్యార్థులు భారీగా చేరుకున్నారు. ఉద్యోగులు, వలస కూలీలు, విద్యార్థినిలు చేతిలో దరఖాస్తులు పట్టుకుని పాస్ కోసం ఠాణా ముందు క్యూ కట్టారు. ఈ సందర్భంగా పోలీసులు వారికి నచ్చజెప్పి తిరిగి పంపించేస్తున్నారు. పాసుల మంజూరు విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే నడుచుకుంటామని... పాసులు జారీకి సూచనలు అందితే పాసులు జారీ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details