Migrant Voters In Telangana : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ గెలుపు కోసం ప్రధాన పార్టీలైన.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పలువ్యూహాలతో ముందడుగు వేస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపోటముల్లో ప్రాధాన పాత్ర వహించే వలసఓటర్ల సమాచార సేకరణకు పార్టీలన్ని కసరత్తులు చేస్తున్నాయి. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలోని మునుగోడు, దేవరకొండ, భువనగిరి, తుంగతుర్తి, ఆలేరు, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోనే సూమారు 2లక్షలకు పైగా ఓటర్లు వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. అత్యధికంగా మునుగోడులోనే నలభై వేలకుపైగా ఓటర్లుంటారని ప్రధాన పార్టీలు గతంలోనే లెక్కతేల్చాయి.
17% అభ్యర్థులు నేరచరితులే: ఏడీఆర్ నివేదిక
వీరంతా హైదరాబాద, భీవండి, ముంబయి, సూరత్, షోలాపూర్ తదితర ప్రాంతాల్లో బతుకుదెరువు కోసం వెళ్లినవారే. మునుగోడు తర్వాత అధికంగా వలస ఓటర్లు ఉన్న నియోజకవర్గం దేవరకొండ. ఇక్కడ సుమారు 25వేల వరకు వలస ఓటర్లుంటారని రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు. వీరంతా.. హైదరాబాద్, మాచర్ల, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లారు. భువనిగిరి, ఆలేరుల్లో సుమారు 20వేల వరకు ఓటర్లుంటారని అంచనా.
TS Political Leaders Concentrated on Migrant Voters:తుంగతుర్తి, సాగర్, సూర్యపేటల్లో సుమారు పది వేలకు మించి వలస ఓటర్లు ఉంటారని ప్రధాన పార్టీల నాయకులు లెక్కలు వేస్తున్నారు. ఇప్పటి నుంచే వీరితో టచ్లో ఉంటూ.. ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందుగానే స్వస్థలాలకు తీసుకొచ్చే విధంగా నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు, గతంలో పార్టీ సానుభూతిపరులుగా ఉన్న వారిని ప్రచారానికి సైతం రావాలని ఓటర్లను ఆహ్వానిస్తున్నారు.
ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వలస ఓటర్లు చిరునామాల వివరాల సేకరణకు ఓ ప్రధాన పార్టీ ప్రత్యేక బృందాలనే నియమించింది. ప్రతి గ్రామంలో ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు బృందంగా ఏర్పడి ఆ గ్రామంలో ప్రతి వలస ఓటరు అడ్రెస్, ఫోన్ నంబరుతో ఓ డేటాబేస్ను తయారు చేస్తున్నారు. వారికి రెండు నెలలపాటు నెలవారిగా జీతం ఇచ్చేందుకు నేతలు సిద్ధమయ్యారు. ఉమ్మడి జిల్లాలోని వలస ఓటర్లు ఎక్కువగా ఉన్న ఓ మండలంలోని ఆయా గ్రామాల్లోని ఓటర్ల చిరునామ సేకరణ చేసే బాధ్యతను రూ.5లక్షల ప్యాకేజీకో ఓ బృంకానికి.. ఓ ప్రధాన పార్టీ నేత అప్పగించినట్లు సమాచారం.