కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో స్వస్థలాలకు చేరుకునేందుకు వలస కూలీల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంక్షల మినహాయింపు సమయాల్లో రైల్వేస్టేషన్లు, బస్టాండులకు చేరుకుంటున్నా.. గమ్యస్థానాలకు చేరుకునేందుకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. ప్రధానంగా సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్‌లలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. రైళ్లు, బస్సులు సమయానికి దొరక్కపోవటంతో.. ముందుకెళ్లక, వెనుదిరగ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
లాక్‌డౌన్‌తో వలస కూలీలకు తప్పని కష్టాలు - Hyderabad latest news
లాక్‌డౌన్ కారణంగా వలస కూలీలకు మళ్లీ కష్టాలు తప్పటం లేదు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి రాకపోకలు సాగించే వారికి.... రవాణ సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంక్షల మినహాయింపు సమయాల్లో రైల్వేస్టేషన్లు, బస్టాండులకు చేరుకుంటున్నా... గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు.

రవాణా సౌకర్యం లేక వలస కూలీల తీవ్ర ఇబ్బందులు
రవాణా సౌకర్యం లేక వలస కూలీల తీవ్ర ఇబ్బందులు
ఆటోవాలాలు ఇదే అదునుగా ప్రయాణికుల నుంచి తక్కువ దూరానికే భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. చేసేది లేక ప్రయాణికులు అక్కడే ఉండిపోవాల్సి వస్తోంది. ఉదయం 6 గంటలకు ఆంక్షల సడలింపు మొదలవుతుందని... అప్పుడు ఆర్టీసీ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు వెళ్తామని చెబుతున్నారు. మరోవైపు ఫుట్‌పాత్‌లపై, బస్టాండుల్లో నిద్రిస్తున్న వలస కూలీల పట్ల జేబు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
ఇదీ చదవండి: బ్లాక్‌ఫంగస్ కేసుల తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన ప్రభుత్వం