తెలంగాణ

telangana

ETV Bharat / state

సొంత ఊళ్లకు వెళ్లేందుకు అనుమతి కోసం పడిగాపులు - migrant labor going backto native

వలస కూలీలు సొంత ఊళ్లకు వెళ్లొచ్చని కేంద్రం ఆదేశాలివ్వగా.. స్థానిక పీఎస్​లలో అనుమతి కోసం బారులు తీరుతున్నారు. సికింద్రాబాద్​ గోపాలపురం పీఎస్​ వద్ద భౌతిక దూరం పాటిస్తూ అనుమతి కోసం పడిగాపులు కాస్తున్నారు.

migrant labors at secundrabad police station
గోపాలపురం పీఎస్ వద్ద వలస కార్మికులు

By

Published : May 5, 2020, 12:25 PM IST

Updated : May 5, 2020, 12:34 PM IST

సికింద్రాబాద్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని లాడ్జ్, హోటళ్లలో పనిచేసే వలస కార్మికులంతా గోపాలపురం పోలీస్ స్టేషన్​కు చేరుకున్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి కోసం సికింద్రాబాద్ గణేష్ ఆలయం నుంచి గోపాలపురం పీఎస్​ వరకు క్యూ కట్టారు.

పోలీస్ స్టేషన్​లో తమ వివరాలు నమోదు చేసుకుని రైళ్లలో తమ ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు వారందరినీ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటూ వివరాలు సేకరిస్తున్నారు.

బిహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు లాక్​డౌన్​ వల్ల ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కేంద్రం ఆదేశాలివ్వగా.. వారి ఇళ్లకు పయనమవుతున్నారు.

Last Updated : May 5, 2020, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details