Mob Attack Cases Hyderabad : హైదరాబాద్ నగరంలో రాత్రి వేళల్లో ఒంటరిగా ఉన్న వారిపై దాడులు చేసి చరవాణులు, డబ్బులు విలువైన వస్తువులు దోపీడి చేస్తున్న కేసులు పెరుగుతున్నాయి. శివారు ప్రాంతాల్లో సాయంత్రం దాటితే చాలు మత్తులో ఆరాచకం సృష్టిస్తున్నారు. వాహనదారులపై దాడులకు దిగుతున్నారు. ఒకప్పుడు కార్యాలయాల్లో పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయాల్లో శునకాల బెడదతో ఇబ్బందిపడే నగర ప్రజలు.. ఇప్పుడు ఆకతాయిలు, నేరగాళ్లకు భయపడతున్నారు.
midnight violence in hyderabad : గత నెలలో జగద్గిరిగుట్ట పరిధిలో ఓ ముఠా హల్‌చల్ సృష్టించింది. రాత్రి వేళల్లో ఒంటరిగా ఆటో ఎక్కుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడ్డారు. గత నెల 14న జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్‌నగర్‌లో దుండగులు కత్తితో బెదిరించి.. మొబైల్‌ఫోన్, కొంత నగదు లాక్కొని దాడి చేశారు. గత నెలలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోమాజిగూడ ప్రాంతంలోనూ.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగి విధులు ముగించుకుని వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన నిందితులు అతనిపై దాడి చేశారు. అతడి వద్ద చరవాణి, గొలుసు లాక్కొని వెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకుని సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
Mob Attack on a Young Boy for Cell Phone :తాజాగా హయత్‌నగర్‌లోని లెక్చరర్స్ కాలనీ సమీపంలో విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న పవన్‌కుమార్ అనే వ్యక్తిపై.. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అతని వద్ద ఉన్న చరవాణిని తీసుకుని పారిపోయారు. గమనించిన స్థానికుల పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణం.. నగరంలో గంజాయి వినియోగం పెరగడమేనని స్థానికులు వాపోతున్నారు.