పంజాగుట్ట ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలో వరసగా రెండు హత్యలు జరిగాయి. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఉన్నతాధికారులు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు సిబ్బంది, అధికారులు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పంజాగుట్ట, సోమాజీగూడ, నాగార్జున సర్కిల్, ఆనంద్‌నగర్ కాలనీ, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో డీజీపీ, పోలీసు కమిషనర్ అంజనీకుమార్, ఇతర అధికారులతో కలిసి పర్యటించారు. పెట్రోలింగ్ వాహనాల్లో అందుబాటులో ఉండాల్సిన పరికరాలు ఏ విధంగా ఉన్నాయి, జీపీఎస్ విధానం ఎలా పనిచేస్తుంది వంటి వివరాలను తెలుసుకున్నారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే అర్ధరాత్రి డీజీపీ ఆకస్మికంగా పర్యటించినట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు.
హైదరాబాద్‌లో అర్ధరాత్రి డీజీపీ పర్యటన
హైదరాబాద్‌లో ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలను పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. హత్యలు, దాడులు, ఇతరత్రా సంఘటనలు అరికట్టడానికి చేపట్టాల్సిన చర్యలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో డీజీపీ మహేందర్‌రెడ్డి అర్ధరాత్రి పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. సిబ్బంది పనితీరు గురించి ఆరా తీశారు.
డీజీపీ మహేందర్ రెడ్డి