తెలంగాణ

telangana

ETV Bharat / state

2018-19లో సత్య నాదెళ్ల వార్షిక సంపాదన రూ.300 కోట్లు - satya nadella

2018-19లో సత్య నాదెళ్ల వార్షిక సంపాదన 300 కోట్లకు చేరింది. 2017-18లో సత్య నాదెళ్ల అందుకున్న మొత్తం 25.8 మి.డా. (సుమారు రూ.181 కోట్లు) కావడం గమనార్హం.

2018-19 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సంపాదన రూ.300 కోట్లు

By

Published : Oct 18, 2019, 9:10 AM IST


మైక్రోసాఫ్ట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్య నాదెళ్ల వార్షిక సంపాదన గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో రూ.300 కోట్ల (42.9 మిలియన్‌ డాలర్ల)కు చేరింది. మైక్రోసాఫ్ట్‌ ఆర్థిక ఫలితాలు రాణించడం ఇందుకు ఉపకరించింది. నాదెళ్ల మూలవేతనం 2.3 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.16.1 కోట్ల) కంటే కాస్త ఎక్కువ ఉండగా, 29.6 మిలియన్‌ డాలర్లు (రూ.207 కోట్లకు పైగా) స్టాక్‌ కేటాయింపుల ద్వారా, మరో 10.7 మి.డా. (సుమారు రూ.75 కోట్లు) ఈక్విటీయేతర ప్రోత్సాహకాల కింద, మరో 1.11 లక్షల డాలర్లు (సుమారు రూ.77.7 లక్షలు) ఇతర పరిహారం కింద ఆయనకు లభించినట్లు సీఎన్‌ఎన్‌ బిజినెస్‌ వెల్లడించింది. 2017-18లో సత్య నాదెళ్ల అందుకున్న మొత్తం 25.8 మి.డా. (సుమారు రూ.181 కోట్లు) కావడం గమనార్హం.
ఇవీ చూడండి : రెండు వేల నోట్లు తగ్గుతున్నాయి.. ఎందుకు?

ABOUT THE AUTHOR

...view details