Michaung Toofan effects in State :మిగ్‌జాం తీవ్ర తుపాను ప్రభావం రాష్ట్రంపై పడుతోంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుండి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు పడుతాయని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, నల్గొండ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. రేపు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం వుందని తెలిపింది.
ముఖ్యమంత్రిగా రేవంత్‌వైపే రాహుల్ మొగ్గు - సాయంత్రం సీఎల్పీ భేటీలో ప్రకటించనున్న డీకే
Heavy Rain in Telangana due to Cyclone Michaung :మిగ్‌జాం తుపాన్‌తీవ్రత బలపడటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయి. భాగ్యనగరంలో ఈదురు గాలులు, చిరు జల్లులతో వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఏపీకి సమీపంలో ఉన్న మండలాల్లో వర్షాల కారణంగా వరి పంటలపై ప్రభావం చూపుతుంది. జిల్లాలోని దమ్మపేట, వేంసూరు, ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, సత్తుపల్లి, కల్లూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్‌ప్రభావంతో విద్యార్థులు ఇబ్బందిపడుతారని ఖమ్మం జిల్లా కలెక్టర్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా ఉదయం నుంచి చల్లటి గాలులతో వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా ఉదయం నుంచి ఓ మోస్తారుతో కూడిన వర్షం కురుస్తుంది. యాదాద్రి ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు ముసురు వర్షంలో తడుస్తూనే స్వామివారి దర్శించుకుంటున్నారు