Mgbs Boy Kidnap Case: హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో అపహరణకు గురైన బాలుడి ఆచూకీ లభ్యమయ్యింది. సీబీఎస్ వద్ద నల్గొండ బస్సులో నవీన్ కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన లక్ష్మణ్... బంధువుల ఇంట్లో ఉంటున్న అతడి కుమారుడిని తీసుకెళ్లేందుకు 9వ తేదీన హైదరాబాద్‌కు వచ్చారు. ఎంజీబీఎస్ ప్లాట్ ఫారం 44 వద్ద బాలుడిని కూర్చోబెట్టి మూత్రశాలకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి నవీన్ కనిపించకపోవటంతో...పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించారు. బాలుడు గుర్తు తెలియని వ్యక్తితో నడుచుకుంటూ వెళ్లినట్లు గుర్తించారు. మిర్యాలగూడ నుంచి వచ్చిన బస్సులో బాలుడిని గమనించిన కండక్టర్..పోలీసులకు సమాచారం అందించారు. నవీన్‌ను పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. అపహరించిన వ్యక్తే బస్సులో ఎక్కించినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు
Mgbs Boy Kidnap Case: ఎంజీబీఎస్ బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం - Mgbs Kidanap Case
Mgbs Boy Kidnap Case: ఎంజీబీఎస్‌లో కిడ్నాప్‌కు గురైన బాలుడిని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలుడిని అపహరించిన వ్యక్తే వదిలి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇదీ జరిగింది: నిన్న హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో మూడేళ్ల బాలుడు నవీన్ అపహరణకు గురయ్యాడు. ఫ్లాట్‌ఫాం నెంబర్ 44 వద్ద ఓ అగంతకుడు బాలుడిని అపహరించుకుపోయినట్లు సీసీ ఫుటేజీల్లో నమోదైంది. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి బాలాపూర్ మండలం రంగనాయకుల కాలనీకి చెందిన లక్ష్మణ్ కూలీ పని చేస్తున్నాడు. అతను పని కోసం భార్య, కుమార్తెతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య మండలం లక్కిరెడ్డిపల్లి గ్రామానికి వలస వెళ్లాడు. ఈ క్రమంలోనే మూడేళ్ల కుమారుడు నవీన్‌ను హైదరాబాద్‌లోని తన బంధువుల ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. ఈ నెల 9న తిరిగి కుమారుడిని తీసుకెళ్లేందుకు బంధువుల ఇంటికి వచ్చాడు. కుమారుడిని తీసుకుని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కేందుకు వెళ్లాడు. రైళ్లు లేకపోవడంతో బస్సులో వెళ్లేందుకు ఎంజీబీఎస్ బస్టాండ్‌కు చేరుకున్నాడు. ఫ్లాట్‌ఫాం నెంబర్ 44 వద్ద బాలుడిని వదిలి... అతడు మూత్రశాలకు వెళ్లాడు. తిరిగొచ్చి చూసేసరికి కొడుకు కనిపించలేదు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక వ్యక్తితో కలిసి బాలుడు నడుచుకుంటూ వెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందాలతో గాలించగా... నవీన్‌ను కనుగొని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.
ఇవీ చూడండి: