ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో రైల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఉదయం 10 గంటల వరకు సాధారణ రోజుల్లో 42 వేల మంది ప్రయాణిస్తారు. ఈరోజు సమ్మె పుణ్యమా... 11 గంటల వరకు లక్ష మంది ప్రయాణించారని మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇవాళ 810 మెట్రో ట్రిప్పులు నడపాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఉదయం 10 గంటల వరకు 100 ట్రిప్పులు పూర్తి చేశామని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.
మెట్రోలో 6 గంటల్లోనే లక్ష మంది ప్రయాణం
ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు మెట్రోని ఆశ్రయిస్తున్నారు. ఇవాళ మెట్రో రైళ్లు జనాలతో కిక్కిరిసిపోయాయి. ఉదయం 11 గంటల వరకు లక్ష మంది ప్రయాణించినట్లు మెట్రో ఎండీ స్పష్టం చేశారు.
ఆర్టీసీ సమ్మెతో కిక్కిరిసిపోయిన మెట్రో రైళ్లు
Last Updated : Oct 5, 2019, 2:36 PM IST