Metro Train Timings : నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షితంగా ప్రయాణించేందుకు గానూ మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు నడపడనున్నట్లు ఆయన తెలిపారు. ప్రారంభ స్టేషన్ నుంచి ఆఖరి మెట్రో రాత్రి 1 గంటకు బయలుదేరి.. 2 గంటలకు ఆఖరి స్టేషన్కు చేరుతుందని స్ఫష్టం చేశారు.
న్యూఇయర్ స్పెషల్.. మెట్రో వేళలు పొడిగింపు.. - హైదరాబాద్ మెట్రో టైమింగ్ పెంపు
Metro Train Timings : హైదరాబాద్ నగరవాసులకు మెట్రో గుడ్న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న మెట్రో వేళలను పెంచుతున్నట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.
హైదరాబాద్ మెట్రో రైలు
మెట్రో రైళ్లలో, స్టేషన్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా మెట్రో పోలీసులు, సెక్యూరిటీ అధికారులు పూర్తి భద్రతా చర్యలు తీసుకుంటారని రెడ్డి పేర్కొన్నారు. ప్రయాణికులు మెట్రో అధికారులకు సహకరించాలని కోరారు.
ఇవీ చదవండి: