తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపటి నుంచి రాయదుర్గం వరకు మెట్రో పరుగులు - హైటెక్​సిటీ నుంచి రాయదుర్గం

హైదరాబాద్​ ప్రయాణికులకు మెట్రో సేవలు మరింత మెరుగవుతున్నాయి. హైటెక్​సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో పరుగులు తీయనుంది. రేపటి నుంచే సేవలు ప్రారంభిస్తామని మెట్రో రైల్​ ఎండీ ఎన్​వీఎస్​ రెడ్డి తెలిపారు.

metro-train-new-corridor-in-hyderabad
పరుగులకు సిద్ధమైన హైటెక్​సిటీ రాయదుర్గం మెట్రో కారిడార్​

By

Published : Nov 28, 2019, 2:34 PM IST

హైదరాబాద్ మహానగరంలో మరో మెట్రో కారిడార్ సిద్ధమైంది. ప్రయాణికుల సౌకర్యార్ధం హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం స్ట్రెచ్ కారిడార్ 3గా పిలువబడే బ్లూలైన్‌ను తెరవడానికి భద్రతా ధృవీకరణ పత్రం జారీ అయింది. మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.

రేపు ఉదయం పదిన్నర గంటలకు మంత్రులు కేటీఆర్, అజయ్‌కుమార్ హైటెక్‌ సిటీ వద్ద మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించనున్నట్లు ఎన్‌వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే రైలులో మంత్రులిద్దరూ రాయదుర్గం వరకు ప్రయాణం చేస్తారని తెలిపారు. ఆ తర్వాత సామాన్యులకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎండీ వివరించారు.

పరుగులకు సిద్ధమైన హైటెక్​సిటీ రాయదుర్గం మెట్రో కారిడార్​

ఇదీ చూడండి: నగరంలో ఆధార్​ సేవా తొలి కేంద్రం ప్రారంభం...

ABOUT THE AUTHOR

...view details