తెలంగాణ

telangana

ETV Bharat / state

Metro winners: మెట్రోలో ప్రయాణించారు.. బహుమతులు అందుకున్నారు.. - మెట్రో సువర్ణ ఆఫర్​ విజేతలు

కొవిడ్​ పరిస్థితుల తర్వాత మెట్రోలో (hyderabad metro) ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మెట్రోలో ప్రయాణించిన వారికి లక్కీడ్రా ద్వారా బహుమతులు అందించేందుకు సువర్ణ ఆఫర్​ను తీసుకొచ్చారు. అందులో భాగంగా విజేతలైన వారికి ఇవాళ అమీర్​పేట్​ మెట్రో స్టేషన్​లో బహుమతులు అందించారు (Metro winners) .

Metro suvarna Offer winners
Metro suvarna Offer winners

By

Published : Nov 22, 2021, 7:41 PM IST

Updated : Nov 22, 2021, 8:43 PM IST

కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మెట్రోలో (hyderabad metro) ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రోజూ 2.30 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో రోజూ 4 లక్షల మంది వరకు ప్రయాణించే అవకాశం ఉందని అన్నారు.

Metro suvarna Offer winners

మెట్రోరైలులో ప్రయాణికులకు సువర్ణ ఆఫర్లలో 2021(Metro suvarna Offer winners) భాగంగా నెలవారీ లక్కీడ్రా (Hyderabad metro lucky draw) నిర్వహించారు. ఈ డ్రాలో గెలిచిన వారికి అమీర్​పేట్​ మెట్రో స్టేషన్​లో బహుమతులు అందించారు. ముగ్గురు విజేతలకు ఎల్​ఈడీ టీవీ, వాషింగ్​ మెషీన్​, మైక్రో ఓవెన్​లను మెట్రో అధికారులు అందించారు. భాగ్యనగర వాసులు మెట్రో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారని మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి అన్నారు. దేశంలో మిగతా మెట్రోలతో పోల్చితే హైదరాబాద్​ మెట్రోకు.. కొవిడ్​ తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు.

సువర్ణ ఆఫర్​లో విజేతలకు బహుమతులు ప్రదానం

ఏంటీ సువర్ణ ఆఫర్​...

పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ప్రయాణికుల కోసం 'మెట్రో సువర్ణ ఆఫర్‌ 2021'ను ప్రకటించింది. 20ట్రిప్పుల ధరతో 30 ట్రిప్పులు ప్రయాణించే అవకాశాన్ని కలిగించింది. ఈ ఆఫర్‌ కాలంలో గరిష్ఠంగా 15రూపాయలు చెల్లించి గ్రీన్‌లైన్‌పై ఎక్కడికైనా ప్రయాణించవచ్చునని ఎల్‌ అండ్ టీ సంస్థ పేర్కొంది. నెలలో 20ట్రిప్పులు, ఆ పైన అధికంగా ప్రయాణించే ప్రయాణికుల కోసం ప్రతీ నెల లక్కీ డ్రా ఏర్పాటు చేశామని తెలిపింది. ఈ ట్రిప్పులను 45రోజులలోపు వినియోగించుకోవాల్సి ఉంటుంది.

ఎప్పటి వరకు ఉంటుంది..

మెట్రోలో సువర్ణ ఆఫర్​ అక్టోబర్​ 18 2021న మొదలైంది. జనవరి 15 2022 వరకు ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌ కేవలం మెట్రో స్మార్ట్‌ కార్డ్‌ (పాత, నూతన)పై మాత్రమే వర్తిస్తుందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:Hyderabad metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త .. మళ్లీ అందుబాటులోకి సువర్ణ ఆఫర్​

Last Updated : Nov 22, 2021, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details