తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎయిర్​పోర్ట్​ వరకు మెట్రో పొడిగింపు - మెట్రో

మెట్రో భాగ్యనగరానికి మకుటాహారం. అలాంటి మెట్రోను ఇప్పడు ఏకంగా శంషాబాద్ వరకు పొడిగిస్తున్నారు. మెట్రో వచ్చాక నగర ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందనే దీనికి కారణం. రెండో దశ పనుల్లో మైండ్​ స్పేస్ నుంచి శంషాబాద్ వరకు పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మొత్తం 31 కిలోమీటర్ల వరకు గల ఈ కారిడార్​ను 5వేల కోట్ల రూపాయలతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.

ఎయిర్​పోర్ట్​ వరకు మెట్రో పొడిగింపు

By

Published : Aug 19, 2019, 10:32 AM IST

Updated : Aug 19, 2019, 11:01 AM IST

మెట్రోలో కీలకమైన ఎయిర్ పోర్ట్ కారిడార్ పనులు త్వరలో చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. హైటెక్ సిటీ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు పనులు చివరి దశలో ఉన్నాయని వెల్లడించారు. రెండు నెలల్లో పనులు పూర్తిచేసి మైండ్ స్పేస్ స్టేషన్ కూడా అందుబాటులోకి తీసుకోస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. హైటెక్ సిటీ-జూబ్లీహిల్స్ మార్గంలో రెండో ట్రాక్ కోసం తుది అనుమతులు త్వరలో రానున్నట్లు తెలిపారు.

రోజుకు 2లక్షల 80వేల మంది ప్రయాణం...

ప్రస్తుతం హైటెక్ సిటీ - అమీర్ పేట్ మధ్య ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. కార్యాలయాల సమయాల్లో ఇదీ మరింత పెరుగుతోంది. హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్​కు ప్రయాణిస్తున్న వారి సంఖ్య ఈ వర్షకాలంలో భారీగా పెరిగింది. ప్రస్తుతం రోజుకు సరాసరిగా 2 లక్షల 80 వేల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు.

మైండ్ స్పేస్ మెట్రో స్టేషన్ మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు. ఇదీ ప్రారంభమైతే రోజుకు సరాసరి 3 లక్షల 50 వేల వరకు ప్రయాణికుల సంఖ్య చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎయిర్​పోర్ట్​ వరకు మెట్రో పొడిగింపు

ఇవీచూడండి: 'తెలంగాణలో భాజపాను బలోపేతం చేయడమే ధ్యేయం'

Last Updated : Aug 19, 2019, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details