మెట్రోరైలు శబ్దాలు రాత్రి కాలనీవాసులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. రైలు ట్రాక్‌పై వెళ్లేటప్పుడు రాపిడితో అధిక శబ్దాలు వస్తున్నాయి. మలుపుల్లో, వర్షాకాలంలో వీటి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోందని స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. రాత్రిపూట మెట్రోరైలు వేళలు ముగిసిన తర్వాత ఇటీవల వరసగా శబ్దాలు వస్తున్నాయి. నిర్వహణలో భాగంగా వ్యవస్థలను పరీక్షించేటప్పుడు చప్పుళ్లు వస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. రోజుల తరబడి చెవులు చిల్లులు పడేలా వస్తున్న ధ్వనులతో సరిగా నిద్ర పట్టడం లేదని ట్రాక్ సమీపంలో నివసించేవారు వాపోతున్నారు.
మెట్రోరైలు నగరంలో 69.2 కిలోమీటర్ల మేర మూడు మార్గాల్లో ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ఈ రైలు వెళ్లేటప్పుడు ట్రాక్ శబ్దాలు ఎక్కువగా వస్తున్నాయి. మెట్రో ప్రారంభం నుంచి ట్రాక్ సమీపంలోని కాలనీవాసులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. రైలు ట్రాక్‌పై కొంతకాలం తిరిగిన తర్వాత చప్పుళ్లు తగ్గుతాయని అధికారులు తెలిపారు. అప్పటికే ఎక్కువగా వస్తున్నట్లయితే ట్రాక్ గ్రైండింగ్ చేపడుతామని చెప్పారు. దీంతో తగ్గుతాయని అధికారులు చెబుతూ వస్తున్నారు. మూడేళ్లు అయినప్పటికీ పరిమితికి మించే ధ్వనులు వెలువడుతున్నాయి.
మలుపుల్లో
కొన్ని ప్రాంతాల్లో మెట్రో మార్గం వంపు ఎక్కువగా ఉంది. ఇలాంటి చోట మెట్రో వెళ్లేటప్పుడు ట్రాక్, చక్రాల నడుమ రాపిడితో ఎక్కువ శబ్దం వస్తోంది. ముఖ్యంగా బోయిగూడ, గ్రీన్‌ల్యాండ్స్ మధురానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పక్కనే నివాసాలు ఉన్నాయి. ప్రతి ఐదు నిమిషాలకు అటు ఇటు ఒక మెట్రో వెళుతోంది. రహదారిపై వెళ్లే వాహన శబ్దాలకు తోడు మెట్రో కూడా తోడవడంతో ప్రశాంతత కరవైందని వాపోతున్నారు. ఖైరతాబాద్ ప్రాంతంలో కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో మెట్రో వేళలు ముగిసిన తర్వాత శబ్దాలు వస్తున్నాయి. శనివారం రాత్రి కూడా వచ్చాయని నిద్ర కరవైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి ప్రమాణాలు.. (డెసిబుల్స్‌లో)
నివాసాల చెంత 50-70