తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాగోల్​ నుంచి విమానాశ్రయానికి మెట్రో నూతన మార్గంపై కసరత్తు'

Metro New Route To Shamshabad Airport : శంషాబాద్‌ విమానాశ్రయానికి మెట్రో నూతన మార్గంపై జరుగుతున్న కసరత్తులో ప్రాథమికంగా కొంత స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌, చంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, పీ7 రోడ్‌ మీదుగా విమానాశ్రయానికి మార్గం మేలనే భావనలో మెట్రో నిపుణులున్నారు.

Metro Rail Corporation Study On Metro New Route
Metro New Route To Shamshabad Airport

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2024, 11:35 AM IST

Metro New Route To Shamshabad Airport : శంషాబాద్‌ విమానాశ్రయానికి మెట్రో నూతన మార్గంపై మెట్రో రైలు సంస్థ అధ్యయనం చేస్తోంది. ఎక్కువ మంది ప్రయాణించేలా మార్గం కోసం కసరత్తు కారిడార్‌-2 చాంద్రాయణగుట్ట వరకే అక్కడే జంక్షన్‌ ఏర్పాటు చేసేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి మెట్రో కొత్త మార్గంపై జరుగుతున్న కసరత్తులో ప్రాథమికంగా కొంత స్పష్టత వచ్చింది. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌, చంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, పీ7 రోడ్‌ మీదుగా విమానాశ్రయానికి మార్గం మేలనే భావనలో మెట్రో నిపుణులున్నారు.

మెట్రో నూతన విధానంపై కొత్త ప్రభుత్వం ప్రణాళికలు - అందరికీ ప్రయోజనం చేకూరేనా?

Metro Rail Corporation Study On Metro New Route : కారిడార్‌-2 కొనసాగింపుగా ఎంజీబీఎస్‌, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి విమానాశ్రయం మార్గంతో పోలిస్తే కారిడార్‌-3 కొనసాగింపు నాగోల్‌ మార్గంలో ఎక్కువ మంది ప్రయాణిస్తారనే అధికారులు అంచనా వేస్తున్నారు. మెట్రోలో ట్రాఫిక్‌ ఒక్కటే కాదు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఫలక్‌నుమా నుంచి వచ్చే మార్గం చంద్రాయణగుట్ట వద్ద ఇరుకుదారి కావడంతోపాటు ఫ్లైఓవర్‌ పైనుంచి మలుపు తీసుకుని నిర్మాణం చేపట్టడం అతిపెద్ద సవాల్‌. అదే నాగోల్‌ నుంచి మార్గమైతే ఫ్లైఓవర్‌కు సమాంతరంగా వెళుతుంది. ఈ మార్గం ఏ మేరకు ఆర్థికంగా లాభసాటి అనే విషయాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు.

సీఎం రేవంత్ కీలక నిర్ణయం - రాయదుర్గం టు శంషాబాద్‌ మెట్రో ప్రాజెక్టు నిలిపివేయాలని ఆదేశం

గుట్ట వరకే

Corridor-2 From MGBS To Falaknuma : కారిడార్‌-2 ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా, అక్కడి నుంచి 1.5 కి.మీ. దూరంలో చంద్రాయణగుట్ట వద్ద కూడలిలో విమానాశ్రయ మెట్రోని కలుస్తుంది. చాంద్రాయణగుట్టలో జంక్షన్‌ ఉంటుంది కాబట్టి జేబీఎస్‌ నుంచి వచ్చేవారు చంద్రాయణగుట్ట వరకు వచ్చి అక్కడ విమానాశ్రయ మెట్రోకి మారాలి. ఎంజీఎబీస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ. మొదటిదశలో చేపట్టాల్సిన మార్గం. దీన్ని పూర్తిచేస్తూ మరో 1.5 కి.మీ. పొడిగిస్తే చంద్రాయణగుట్ట వరకు వస్తుంది. అదే విధంగా ఈ మార్గంలో విమానాశ్రయానికి వెళ్లేవారితో పోలిస్తే నిత్యం నగరానికి వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది.

పలు పైవంతెనలు

Metro New Route With Public, Private Partnership : ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టేందుకు అనువుగా ఉండే మార్గంవైపు అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఎవరైనా ముందుకొస్తే వారికి నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తారు. ఒకవేళ ఎవరూ రాకపోతే ప్రభుత్వమే నిర్మిస్తుంది. నిర్వహణను ప్రైవేటుకు అప్పగిస్తుంది. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు 5 కి.మీ. మార్గం గతంలోనే ప్రతిపాదించారు. దీన్ని చేపట్టడంతోపాటు కొత్తగా విమానాశ్రయం వరకు విస్తరిస్తే సరిపోతుంది. అయితే నాగోల్‌ - చంద్రాయణగుట్ట - విమానాశ్రయ మార్గంలోనూ సవాళ్లున్నాయని అధికారులు గుర్తించారు. పెద్దగా భూసేకరణ సమస్యలు లేకపోయినా ఈ మార్గంలో 5 ఫ్లైఓవర్లు ఉన్నాయి. వీటి పక్క నుంచి మెట్రోరైలు నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఈ మార్గంలో దూరం పెరుగుతుంది.

మెట్రో ట్రాక్​పై యువతి ఆత్మహత్యాయత్నం- వైరల్ వీడియో వెనుక కథ ఇదీ!

హైదరాబాద్ మెట్రో రెండోదశకు గ్రహణం - అంచనా వ్యయం పెరిగిందన్న కేంద్రం- మదింపు దశలోనే డీపీఆర్‌

ABOUT THE AUTHOR

...view details