తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో పెట్టుబడులకు ఆసక్తి పెరుగుతోంది: ఎన్వీఎస్​ రెడ్డి - మెట్రో ఎన్వీఎస్​ రెడ్డి తాజా వార్తలు జూబ్లీహిల్స్​

ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ తనిష్క్​ కొత్త శాఖ ప్రారంభోత్సవంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి పాల్గొన్నారు. పలు వ్యాపార సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు. నాణ్యమైన బంగారు ఆభరణాలు వినియోగదారులకు అందిచండంలో తనిష్క్ ఎప్పుడూ ముందుంటుందని సంస్థ వ్యాపార భాగస్వామి వి.వి రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. నూతన తనిష్క్ షోరూమ్ ప్రారంభం సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

హైదరాబాద్​లో పెట్టుబడులకు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి: ఎన్వీఎస్​ రెడ్డి
హైదరాబాద్​లో పెట్టుబడులకు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి: ఎన్వీఎస్​ రెడ్డి

By

Published : Oct 17, 2020, 3:10 PM IST

ప్రముఖ జ్యూయలరీ సంస్థ తనిష్క్‌ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో మరో కొత్త శాఖ ప్రారంభించింది. ఈ షోరూమ్‌ను మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి, తనిష్క్​ వ్యాపార భాగస్వామి వి.వి. రాజేంద్రప్రసాద్‌, షోరూమ్‌ సీఈఓ సోమరాజు తదితరులు ప్రారంభించారు. పలు వ్యాపార సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు.

నాణ్యమైన బంగారు ఆభరణాలు వినియోగదారులకు అందిచండంలో తనిష్క్ ఎప్పుడూ ముందుంటుందని సంస్థ వ్యాపార భాగస్వామి వి.వి రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. నూతన తనిష్క్ షోరూమ్ ప్రారంభం సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒకవైపు ఆభరణాలు, మరోవైపు గడియారాలతో పాటు ఉచితంగా కంటి పరిక్షలు చేయడం.. ఇలా అన్నీ ఒకే చోట ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.

ఇదీ చదవండి:దసరా సందర్భంగా మెట్రో ప్రయాణికులకు 40 శాతం రాయితీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details