తెలంగాణ

telangana

ETV Bharat / state

సులభమైన మెట్రో ప్రయాణానికి మరో యాప్​ - హైదరాబాద్​ మెట్రో తాజా వార్త

హైదరాబాద్​లో ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు.. కాలుష్యం, ట్రాఫిక్​ సమస్యలను తగ్గించేందుకు మెట్రో మరో అధునాతన ఆర్​-పూల్​ యాప్​కు రూపకల్పన చేసింది. ఈ ఆర్​-పూల్​ యాప్​ను రెడ్​బస్ యాప్​తో కలిసి వినియోగంలోకి తీసుకురానున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్​రెడ్డి తెలిపారు.​

metro latest app launch in Hyderabad
మెట్రో ప్రయాణానికి ఆర్-​పూల్​ యాప్​

By

Published : Jan 21, 2020, 2:04 PM IST

Updated : Jan 21, 2020, 3:25 PM IST

హైదరాబాద్‌ను ట్రాఫిక్, కాలుష్యం వెంటాడుతున్నాయని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి అన్నారు. వీటి నుంచి నగర ప్రజలను కాపాడేందుకు.. ట్రాఫిక్‌, కాలుష్యాన్ని తగ్గించేందుకు వివిధ రకాల ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్‌ మెట్రో ఎన్నో యాప్‌లు తెచ్చిందని గుర్తుచేశారు.

ఇప్పుడు ఆర్-పూల్‌తో కలిసి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్​రెడ్డి పేర్కొన్నారు. కార్​పూల్​, బైక్​ పూల్​​ సర్వీసులను రెడ్​బస్​ సీఈవో శ్రీ ప్రకాశ్​ సింగంతో కలిసి హైదరాబాద్​లో ఆయన ప్రారంభించారు. ఈ యాప్‌ ద్వారా మెట్రోలో ప్రయాణించవచ్చని తెలిపారు.

ఈ ఆర్​-పూల్​తో రెడ్​బస్​ సర్వీసులను ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు. ఈ విధానం ద్వారా ఒక కిలోమీటరకు రెండు రూపాలయలు ఛార్జ్​ చేస్తారని తెలిపారు. ప్రజలు ఈ సర్వీసులను వినియోగించుకోవాలని సూచించారు.

సులభమైన మెట్రో ప్రయాణానికి మరో యాప్​

ఇదీ చూడండి : ఈ బెలూన్​లను ఎట్టి పరిస్థితిలోనూ తాకొద్దు

Last Updated : Jan 21, 2020, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details