నాగోల్, ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ల నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీకి మెట్రో ఫీడర్ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఎల్ అండ్ టీ అధికారి అనిల్‌కుమార్, ఆర్ఎఫ్సీ సీఈవో రాజీవ్ జల్నాపుర్కర్ ఈ సేవలకు శ్రీకారం చుట్టారు. ముందుగా వారాంతాలు, సెలవు రోజుల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని మెట్రో అధికారులు తెలిపారు. మెట్రో స్టేషన్ల నుంచి ఉదయం 8 నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు బస్సు సర్వీసులు నడుస్తాయని వెల్లడించారు. రామోజీ ఫిలింసిటీ నుంచి సాయంత్రం 6 నుంచి ఆరున్నర గంటల వరకు బస్సు సర్వీసులు తిరుగు ప్రయాణ సేవలు అందిస్తాయని వెల్లడించారు. రానున్నరోజుల్లో రద్దీకి అనుగుణంగా ప్రతిరోజు సర్వీసులు అందుబాటులోకి తెస్తామని మెట్రో అధికారులు స్పష్టం చేశారు.
రామోజీ ఫిల్మ్‌సిటీకి మెట్రో ఫీడర్ బస్సు సర్వీసులు - metro feeder busses
రామోజీ ఫిల్మ్‌సిటీకి మెట్రో ఫీడర్ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. నాగోల్, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ల నుంచి సర్వీసులను అధికారులు ప్రారంభించారు.
రామోజీ ఫిల్మ్‌సిటీకి మెట్రో ఫీడర్ బస్సు సర్వీసులు